యాదగిరి గుట్ట నారసింహుడి దర్శనానికి 2గంటల సమయం

యాదగిరి గుట్ట నారసింహుడి దర్శనానికి 2గంటల సమయం

కార్తీకమాసం రెండవ సోమవారం కావడంతో యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం భక్తుల అనాయితీ. ఈ నేపథ్యంలో సత్యనారాయణ స్వామి వ్రత మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

రేపు చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15  నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారు. రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం  చేస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేయనున్నారు.