క్రాకర్స్ నిషేధంతో 2వందల కోట్ల నష్టం

క్రాకర్స్ నిషేధంతో 2వందల కోట్ల నష్టం

తెలంగాణలో క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుంది. దీనికి సంబంధించి కచ్చితంగా నిషేధించి తీరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పటాకులను బ్యాన్ చేయడంపై క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీ గ్రౌండ్ లో క్రాకర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా సభ్యులు మాట్లాడారు.

ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా 2 వందల కోట్ల రూపాయల క్రాకర్స్ టర్నోవర్ జరుగుతుందని తెలిపారు. 50 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నామన్నారు. పటాకులను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమను కలచి వేసిందన్నారు. బ్యాన్ చేసే విషయమైతే ఫైర్ అనుమతులు ఎందుకు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పు హోల్ సేల్ వ్యాపారులకు ఆరు నెలల కింద చెప్పి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. రెండు రోజులు పాటు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన అసోసియేషన్ సభ్యులు…తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రెండు రోజులు అవకాశం ఇస్తే తమ సరుకు అమ్ముడుపోయి.. అప్పులు తీరుతాయంటున్నారు. లేదంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటున్నారు క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు.