స్కూళ్లు తెరవొద్దని 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

స్కూళ్లు తెరవొద్దని 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

కేసులు పెరుగుతుంటే.. స్కూళ్లు తెరవొద్దు

కేంద్ర ప్రభుత్వానికి 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

న్యూఢిల్లీ: స్కూళ్ల రీఓపెన్ పై స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితి మెరుగు పడేవరకు లేదా వ్యాక్సిన్ వచ్చేవరకు స్కూళ్లను తెరవద్దంటూ  దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది పేరెంట్స్ కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ పంపారు. రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీలతో చర్చించి జులైలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఇతర విద్యా సంస్థలను రీఓపెన్ చేస్తామని కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది. ‘జులైలో స్కూళ్లు రీఓపెన్ చేయాలన్న నిర్ణయం దారుణం. మంటలు ఆర్పక ముందే దానితో చెలగాటం అడినట్లు అవుతుంది. ప్రస్తుత అకాడమిక్ ఇయర్ ఈ-లెర్నింగ్ మోడ్ లో కొనసాగాలి. వర్చువల్ లెర్నింగ్ ద్వారా స్కూళ్లు మంచిగా పని చేస్తున్నాయంటే అకాడమిక్ ఇయర్ మొత్తం కొనసాగించవచ్చు’అని 2.13 లక్షల మంది పేరెంట్స్ సంతకాలు పెట్టిన పిటిషన్ లో పేర్కొన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. స్కూళ్లలో ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారు. లంచ్ బ్రేక్ లు, స్కూల్ బస్సులు, అన్నిచోట్ల కరోనా వ్యాపిస్తుందనే భయం ఉంటుంది. కేసులు పెరుగుతున్న సమయంలో స్కూళ్లు తెరవాలన్నది మంచి నిర్ణయం కాదు’ అని ఏడేళ్ల కొడుకున్న స్వాతి భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.  కరోనా కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు, స్కూళ్లు మూతపడ్డాయి.

For More News..

ప్రపంచానికిప్పుడు కేర్, క్యూర్ కావాలి

సచిన్‌ ఆట కోసం క్లాస్‌లు ఎగ్గొట్టాం

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

జనం కోసమే తెలంగాణ