ఇద్దరు పిల్లలకు కరోనా.. యూపీ స్కూల్‌లో ఆఫ్‌లైన్ క్లాసులు రద్దు

ఇద్దరు పిల్లలకు కరోనా.. యూపీ స్కూల్‌లో ఆఫ్‌లైన్ క్లాసులు రద్దు

దేశంలో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. అక్కడొకటి అక్కడొకటిగా.. కొత్త వేరియంట్ కరోనా ఎక్స్ఈ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ్లీ కరోనా జాగ్రత్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగానే పాఠశాలను మూసేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ లో ఇద్దరు పిల్లలకు కొవిడ్ సోకగానే... అప్రమత్తమై ఆఫ్ లైన్ క్లాసులను రద్దు చేసినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. మూడు రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత కొత్త కేసులేవీ నమోదు కాకుంటే ఆఫ్ లైన్ క్లాసుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇంటి వద్ద ఉన్న సమయంలో పిల్లల ఆరోగ్య పరిస్థితిని గమనించి, మళ్లీ స్కూల్ ఓపెన్ చేశాక క్లాసులకు పంపే విషయంలో నిర్ణయం తీసుకోవాలని పేరెంట్స్ కు సూచిస్తూ సర్క్యులర్ ఇష్యూ చేసింది. క్యాంపస్ తో పాటు స్కూల్ బస్సులను మొత్తం శానిటైజ్ చేస్తున్నామని అందులో పేర్కొంది.

కాగా, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన అన్ని క్లాసులకు ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని ఫిబ్రవరి 17నే యూపీ రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

అడ్డగోలు ఫీజులు.. ఒక్కో క్లాసులో వందల మంది

పండుగ పూట నాన్ వెజ్.. జేఎన్యూ విద్యార్థుల మధ్య కొట్లాట

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎయిర్‌‌‌‌‌‌లైన్ కంపెనీగా ఇండిగో