ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఎయిర్‌‌‌‌‌‌లైన్ కంపెనీగా ఇండిగో

ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఎయిర్‌‌‌‌‌‌లైన్ కంపెనీగా ఇండిగో
  • వాల్యూమ్స్‌, కెపాసిటీ, మార్కెట్‌ సైజ్‌.. అన్నింటిలోనూ గ్లోబల్‌ కంపెనీలతో పోటీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద  ఎయిర్‌‌‌‌‌‌లైన్ కంపెనీగా ఇండిగో నిలిచింది. మార్చి నెలలోని ప్యాసెంజర్ల  సంఖ్యను బట్టి ఈ ర్యాంకింగ్‌‌ను  యూకే కంపెనీ అఫీషియల్ ఎయిర్‌‌‌‌లైన్ గైడ్‌‌ (ఓఏజీ) విడుదల చేసింది. ఫ్రీక్వెన్సీ, కెపాసిటీ  పరంగా చూసినా ప్రపంచలోని టాప్ 10 ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీల్లో ఇండిగో చోటు సంపాదించుకుంది. ఓఏజీ డేటా ప్రకారం,   ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం 20.2 లక్షల మంది ప్యాసెంజర్లను తమ గమ్యస్థానాలకు ఇండిగో చేరవేసింది. సీట్ల కెపాసిటీ పరంగా చూస్తే ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీల్లో ఇండిగో  ఎనిమిదో ప్లేస్‌‌లో ఉందని ఓఏజీ పేర్కొంది.  మార్చి నెలలో  ఈ కంపెనీ సీట్ కెపాసిటీ  41.3 శాతం (నెల ప్రాతిపదికన) పెరిగింది. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే కంపెనీ  సీట్ కెపాసిటీ మార్చిలో 14.7 శాతం పెరిగింది. మార్కెట్ సైజ్‌‌ ప్రకారం చూసినా ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీల్లో ఇండిగో ఒకటి. ఇది 2006 లో ప్రారంభమయ్యింది.  ఒక్క విమానంతో స్టార్టయిన కంపెనీ జర్నీ ప్రస్తుతం 276 విమానాలకు చేరుకుంది. ప్యాసెంజర్  సెగ్మెంట్‌‌లో ఇండిగోకి 55 శాతం వాటా ఉంటుంది.