రూ. 2000 నోట్లు కనిపిస్తలే!

రూ. 2000 నోట్లు కనిపిస్తలే!

ఎన్నికల వేళ హైదరాబాద్ లో పెద్ద నోటుకు కరువు. రూ. 2000 నోట్లకు కరువొచ్చిం ది. ఏ ఏటీఎంకు వెళ్లినా రూ. 500 లేదా రూ.100 నోట్లు తప్ప..పెద్ద నోటు వస్తున్న దాఖలాలు చాలా తక్కువ. నగర జనం ఇప్పుడు దీని మీదే ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజులే టైం ఉన్న నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు ‘పెద్ద నోటు’ను స్టాక్ చేసుకుని ఉంటారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇటీవల రైడ్లలో పట్టుబడుతున్న సొమ్ములోనూ ఎక్కువగా రూ.2000 నోట్లే ఉంటున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. ఏటీఎంలలో తక్కువ విలువ ఉన్న నోట్లే ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పట్టుకుని వెళ్లడం తలకు మించిన భారంగా మారుతోందని జనం చెబుతున్నారు. సికింద్రాబాద్, సిటీ నడిబొడ్డున ఉన్న కొన్ని ప్రాంతాల్లో రూ.500, రూ.100 నోట్లే వస్తున్నాయి.

కొద్ది నెలలుగా 2000 నోట్లు తక్కువగా వస్తున్నాయని, RBI నుంచి సప్లై తగ్గిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మూడు నెలలుగా పాత రూ. 2000 నోట్లు తిరిగి చలామణీలోకి రావడం లేదని ఆంధ్రా బ్యాంక్ ఎంప్లా యిస్​ యూనియన్​ సెక్రటరీ కొండల్​ రావు చెప్పారు. RBI కూడా తగినన్ని నోట్లను సరఫరా చేయడం లేదన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం మార్చి 201 7 నాటి కి దేశంలో 328.5 కోట్ల రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. మార్చి 2018 నాటి కి 336.3 కోట్లకు పెరిగాయి. అదే కాలానికి మొత్తం నోట్లలో చలామణీలో ఉన్నవి కేవలం 37.3 శాతం.