
కర్ణాటకలో సోషల్ మీడియా వేదికగా తమ స్థాయిని మరచి విమర్శలు చేసుకున్న మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లను అధికారులు పోస్టింగ్ లేకుండా బదిలీ చేశారు. ఐపీఎస్ రూప మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరిలను వారి శాఖల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఐపీఎస్ రూప, ఐఏఎస్ రోహిణిపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ఫేస్ బుక్ లో ఆమెకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అనంతరం స్పందించిన రోహిణి.. రూప మతిస్థిమితం కోల్పోయారని, ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదం కాస్తా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆ ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిద్దరినీ ఎలాంటి పోస్టింగ్ లేకుండా ట్రాన్స్ ఫర్ చేశారు.