20 కుక్కలకు విషం పెట్టి చంపిన్రు

20 కుక్కలకు విషం పెట్టి చంపిన్రు
  •     కరీంనగర్ ​జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలో దారుణం
  •     జీపీ ట్రాక్టర్ లోనే కళేబరాల తరలింపు  

గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ ​జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో  బుధవారం విషం పెట్టి 20 కుక్కలను చంపేశారు.  ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా కుక్కుల దాడిలో గాయపడి  చనిపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు తమ గ్రామంలోని కుక్కల సమస్యను నివారించడానికి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని గ్రామ పాలకవర్గం కుక్కలను చంపడం మొదలుపెట్టింది. బుధవారం విషం పెట్టి   20 కుక్కలను చంపేసి  గ్రామపంచాయతీ ట్రాక్టర్ లోనే తరలించి ఖననం చేసింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అంతలా సమస్య ఉంటే ఎక్కడైనా వదిలేయాలని, చంపడమేమిటని ప్రశ్నిస్తున్నారు.