
టూవీలర్ బైక్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీ గ్లామర్ బైక్ లు అంటే అందరికీ తెలిసిందే.. సింపుల్ గా స్మూత్ గా ఉండే ఈ బైకులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మార్కెట్లో కనిపించడం లేదు. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ అప్ డేటెడ్ వెర్షన్ తో కొత్త మోడల్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇవాళ ఢిల్లీలో ఇండియన్ మార్కెట్లో 2023 హీరో గ్లామర్ అప్ డేటెడ్ వెర్షన్ ను లాంచ్ చేసింది.
కొత్త గ్లామర్ 125సీసీ మోటార్ సైకిల్ గా మార్కెట్లోకి వస్తుంది. డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ బైక్ ధర రూ.82,388,(ఎక్స్ షోరూమ్), డిస్క్ వేరియంట్ ధర రూ. 86,348(ఎక్స్ షోరూమ్) గా కంపెనీ రేటు ఫిక్స్ చేసింది.
2023 హీరో గ్లామర్ పూర్తిగా డిజిటల్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ రూపంలో కొత్త ఫీచర్లతో ఉంటుంది. ఇది రిఫ్రెష్డ్ డిజైన్, i3S టెక్నాలజీతో తో 63 కి.మీ మైలేజీ వస్తుందని కంపెనీ తెలిపింది.
కొత్త గ్గామర్ లో ఫ్రంట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, ష్రౌడ్ ఫీచర్లు ఉన్నాయి. బైక్ క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్ , స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ - బ్లాక్ కలర్స్ లో వస్తున్నాయి. ఈ కొత్త గ్లామర్ ఇంజన్ OBD2, E20 125సీసీ ఇంజిన్ తో అందించబడుతుంది.