
- ఖైరతాబాద్‌లో అత్యధికంగా 70 అడుగుల మహా గణపతి
- కొత్తపేట బాలాజీ నగర్లో 54 అడుగుల మట్టి వినాయకుడు
- వనస్థలిపురం ఎన్జీఓస్కాలనీలో 30..మూసాపేటలో 32 అడుగుల గణనాథులు
ఎల్బీనగర్/జీడిమెట్ల/కూకట్పల్లి, వెలుగు : గ్రేటర్‌సిటీలో నవరాత్రులు పూజలు అందుకునేందుకు గణనాథులు సిద్ధమయ్యారు. అత్యధికంగా ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్బీనగర్కొత్తపేట బాలాజీనగర్‌లో 54 అడుగుల్లో, మూసాపేటలో 32 అడుగుల్లో, వనస్థలిపురం ఎన్జీఓస్కాలనీలో 30 అడుగుల్లో, సూరారం 25 అడుగుల్లో భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వీటితోపాటు సిటీ వ్యాప్తంగా లక్షన్నర విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు భాగ్యనగర్గణేశ్ఉత్సవ సమితి చెప్పింది.
మూసాపేటలో 32 అడుగుల మట్టి గణపతి
మూసాపేటలో 32 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 60 ఏండ్ల కింద మూసాపేట పంచాయితీ వార్డు ఆఫీస్దగ్గర మూడు అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఏటా ఎత్తును పెంచుకుంటూ వస్తున్నారు. గత 35 ఏండ్ల నుంచి 32 అడుగులతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. మూసాపేట నవ యువక యువజన సంఘం ఆధ్వర్యంలో నెల రోజుల ముందు నుంచే ధూల్‌పేట కళాకారులు ఈ భారీ విగ్రహ పనులు మొదలుపెట్టి పూర్తిచేశారు. శనివారం సాయంత్రం పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.