దేశంలో ఎన్నికల సైరన్ మోగింది.. కోడ్ వచ్చేసింది

దేశంలో ఎన్నికల సైరన్ మోగింది.. కోడ్ వచ్చేసింది

2024 సార్వత్రిక ఎన్నికల  నగరా మోగింది.  పార్లమెంట్​ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.   దేశవ్యాప్తంగా 96 కోట్ల 28 లక్షల మంది ఓటర్లున్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్​ అమలు కానుంది. జూన్​ 16 తో పార్లమెంట్​ 18 వ లోక్ సభ గడువు ముగియనుంది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి.  ఎన్నికల్లో 1.50 కోట్ల మంది విధులు నిర్వహించనున్నారు. జూన్​ 16 లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఈసీ ప్రకటించింది. కశ్మీర్​ లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈసీ తెలిపింది. 55 లక్షల ఈవీఎంలను సిద్దం చేసినట్లు ఈసీ రాజీవ్​ కుమార్​ తెలిపారు.