
నైజీరియాలో ఘటన
లాగోస్: నైజీరియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ పిల్లలే. ఎనుగు స్టేట్ లోని ఆవ్ గు లో అదుపు తప్పిన ఓ ట్రక్కు.. స్కూల్ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది పిల్లలు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. పిల్లలంతా అవ్ గు లోని నర్సరీ, ప్రైమరీ స్కూల్ కు చెందినవారని, మృతుల్లో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలిపారు.