ఉమ్మడి నిమాజాబాద్ జిల్లాలో మూడో విడతలో 2,143 నామినేషన్లు

 ఉమ్మడి నిమాజాబాద్ జిల్లాలో మూడో విడతలో 2,143 నామినేషన్లు
  • నిజామాబాద్​ జిల్లాలో 1,077 దాఖలు
  • కామారెడ్డి జిల్లాలో 1,066 

నిజామాబాద్​/ కామారెడ్డి, వెలుగు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నిమాజాబాద్​లో 2,143 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఆశావహులు క్యూకట్టి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. 

శనివారం స్ర్కూటినీ నిర్వహించి అర్హత గల నామినేషన్ల సంఖ్యను అధికారులు తేల్చారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లోని 165 సర్పంచ్​ స్థానాలకు 1,077 నామినేషన్​లు పడ్డాయి. 1,620 వార్డులుండగా 4,021 నామినేషన్​లు ఆర్వోలు స్వీకరించారు. 

కామారెడ్డి జిల్లాలో 168 పంచాయతీలకు 1,066 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలు 1,482 ఉండగా 3,060 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలో ఆలూర్​, ఆర్మూర్​, బాల్కొండ, భీంగల్, డింకేశ్వర్, కమ్మర్​పల్లి, మెండారో, మోర్తాడ్​, ముప్కాల్​, నందిపేట, వేల్పూర్​, ఎర్గెట్ల మండలాలు, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, బీర్కుర్​, నస్రుల్లాబాద్, జుక్కల్, మద్నూర్,  బిచ్​కుంద, డొంగ్లి, పెద్దకొడప్​గల్​ మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.

 ఈ నెల 9 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్​డ్రాకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు, గుర్తులుప్రకటించనున్నారు.