కరెంట్ స్తంభాన్ని పట్టుకుంటే.. మృత్యుకాటు

కరెంట్ స్తంభాన్ని పట్టుకుంటే.. మృత్యుకాటు

కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  వర్షాల కారణంగా బెంగళూరు నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని నదులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల ఓ యువతి అనుకోని ప్రమాదంలో చిక్కుకొని ఏకంగా ప్రాణాలను కొల్పోయింది. ఈ ఘటన బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ సమీపంలోప్రాంతంలో జరిగింది. 

అఖిల అనే ఓ 23 ఏళ్ల యువతి ఓ పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తుంది. డ్యూటీ కంప్లీట్ అయ్యాక రాత్రి స్కూటీపై ఇంటికి వెళుతోంది. ఈక్రమంలో ఆమె స్కూటీ రోడ్డుపై మోకాళ్ల లోతు నీటిలో చిక్కుకోగా.. ఆమె బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని పట్టుకుంది. వెంటనే కరెంట్ షాక్ కు గురై కింద పడిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే  చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. 

కర్ణాటకలో గ‌త 90 ఏళ్లలో ఇలాంటి వ‌ర్షం ప‌డ‌లేద‌ని సీఎం బొమ్మై తెలిపారు. బెంగళూరులో వరదల నివారణకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగళూరు నగరంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.