రూ. 23 కోట్ల చేప.. పట్టిండు వదిలేసిండు

రూ. 23 కోట్ల చేప.. పట్టిండు వదిలేసిండు

ఒకాయన తన టీంతో చాపలు పట్టనింకె పోయిండు. గాలమేసిండు. మనోడి లక్కు బాగున్నట్టుంది. జబర్దస్త్‌‌‌‌ చేప పడ్డది. అట్లాంటిట్లాంటిది గాదు. ట్యూనా ఫిష్‌‌‌‌. రెండున్నర మీటర్ల పొడవు, 270 కిలోల బరువుంది. అమ్మితే రూ. 23 కోట్లు పోతది. కానీ మనోడు గాలం తీసిండు. దాన్ని నీళ్లలో వదిలేసిండు. అతని పేరు డేవ్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌. ఐర్లాండ్‌‌‌‌లోని డొనెగల్‌‌‌‌ బే ప్రాంతంలో ఆ చేపను పట్టిండు. ఇంతకీ అతను దాన్ని ఎందుకు వదిలేసిండంటరు? ఎందుకంటే అట్లాంటిక్‌‌‌‌లో చేపల సంఖ్య ఎంతుందో, ఎక్కడ ఎక్కువుందో తెలుసుకోడానికి అతడు, తన బృందం పని చేస్తోంది మరి. అక్టోబర్‌‌‌‌ 15 వరకు వీళ్లు పని చేస్తూనే ఉంటరు. ‘‘డొనెగల్‌‌‌‌ బేలో టూనా ఫిష్‌‌‌‌లు మామూలే. కానీ ఈ ఏడాది పట్టుకున్న వాటిలో ఇదే పెద్దది’’ అని డేవ్‌‌ ఎడ్వర్డ్స్‌‌ అన్నాడు. ఆ ఫొటోను అతడు ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేయడంతో వైరల్‌‌ అయింది.