దసరా ఎఫెక్ట్.. రూ.62 వేలకు చేరువలో బంగారం ధర

దసరా ఎఫెక్ట్.. రూ.62 వేలకు చేరువలో బంగారం ధర

వారం రోజుల కింద భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు అనిశ్చిత సమయాల్లో సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా పరిగణించబడే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.పండగ సీజన్ కావడంతోబంగారం షాపుల దగ్గర కొనుగోలు దారులు క్యూ కడుతున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ లో  అక్టోబర్ 21న రూ.61,530 గా ఉన్న 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి  రూ. 61,750 కి చేరువైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 56 వేల 600గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600 గా ఉంది. 

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 210 పెరగడంతో  రూ. 61,900గా ఉంది.  ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 56,750 గా ఉంది. 

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 పెరగడంతో  రూ. 61,750గా ఉంది.  ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర200 పెరగడంతో  రూ 56,600 గా ఉంది.