హైదరాబాద్‌లో 2,420 లగ్జరీ ఇండ్ల అమ్మకం

హైదరాబాద్‌లో 2,420 లగ్జరీ ఇండ్ల అమ్మకం

 న్యూఢిల్లీ :  లగ్జరీ ఇండ్లు కొనేవారి సంఖ్య మెట్రో సిటీల్లో పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు (ఏడు ప్రధాన నగరాల్లో) 25,680 యూనిట్లకు చేరాయి. ఇవి పోయిన మూడు సంవత్సరాల వార్షిక అమ్మకాలను దాటేశాయి.   ముంబై  మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్​) మొత్తం లగ్జరీ హౌసింగ్ అమ్మకాల్లో 50 శాతానికి పైగా వాటా సాధించింది. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ సంవత్సరం లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. డెవలపర్లు అందించే డిస్కౌంట్లు,  ప్రవాస భారతీయుల (ఎన్​ఆర్​ఐలు) నుంచి వచ్చిన డిమాండ్ ఇందుకు సహాయపడింది. మనదేశంలోని ఏడు ప్రధాన నగరాలు ఢిల్లీ-–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్​), పూణే, హైదరాబాద్, చెన్నై  కోల్‌‌కతా, బెంగళూరులలో ఈ ఏడాదిలో -జూన్ వరకు లగ్జరీ ఇండ్ల అమ్మకాలు 25,680 యూనిట్లు. 2021 క్యాలెండర్ సంవత్సరంలో అమ్ముడయిన 21,700 యూనిట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. 2020లో  మహమ్మారి ప్రభావం కారణంగా లగ్జరీ అపార్ట్‌‌మెంట్ల అమ్మకాలు 2019లో 17,740 యూనిట్ల నుంచి 8,470 యూనిట్లకు పడిపోయాయి. 2022 మొదటి ఆరు నెలల్లో ఏడు నగరాల్లోని 1.84 లక్షల యూనిట్ల ఇండ్ల అమ్మకాల్లో లగ్జరీ ఇండ్ల వాటా 14 శాతానికి పెరిగింది. 2019 మహమ్మారికి ముందు సంవత్సరంతో పోల్చిచూస్తే మొత్తం అమ్మకాల్లో లగ్జరీ ఇండ్ల వాటా కేవలం 7 శాతం మాత్రమే. ఈ రిపోర్టు గురించి అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ ఎండ్​ యూజర్ల నుంచి డిమాండ్​ వల్ల లగ్జరీ హౌసింగ్ అమ్మకాలు బాగున్నాయని చెప్పారు. "డెవలపర్లు ఇస్తున్న తగ్గింపులు ఈ కొనుగోలుదారులకు లగ్జరీ ప్రాపర్టీలను చాలా ఆకర్షణీయంగా మార్చాయి. డాలర్​ విలువ పెరగడంతో ఎన్​ఆర్​ఐలు కూడా భారతదేశంలో లగ్జరీ ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు" అని ఆయన తెలిపారు.

నగరాల వారీగా అమ్మకాలు..
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢిల్లీ–-ఎన్‌‌సీఆర్‌‌లో లగ్జరీ ఇండ్ల అమ్మకాలు 4,160 యూనిట్లుగా రికార్డయ్యాయి. 2019లో ఇక్కడ1,680 యూనిట్లు, 2020లో 700 యూనిట్లు, 2021లో 2,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబై–ఎంఎంఆర్​లో​ 2022 మొదటి ఆరు నెలల్లో 13,670 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ నగరంలో 2019లో 10,210 యూనిట్లు, 2020లో 5,840 యూనిట్లు , 2021లో 13,720 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో ఈ ఏడాది జనవరి-–జూన్ మధ్య కాలంలో 2,430 లగ్జరీ యూనిట్లను అమ్మారు. 2019లో 3,030 యూనిట్లు, 2020లో 930 యూనిట్లు, 2021లో 1,550 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లో పూణేలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,460 యూనిట్లుగా నమోదయ్యాయి. పూణేలో డిమాండ్ 2019లో 500 యూనిట్లు కాగా, 2020లో 170 యూనిట్లు, 2021లో 880 యూనిట్లు.హైదరాబాద్‌‌లో ఈ ఏడాది జనవరి–-జూన్​లో 2,420 లగ్జరీ ఇండ్లు అమ్ముడయ్యాయి. 2019 సంవత్సరంలో 1,660 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు  2021లో 1,880 యూనిట్లు సేల్​ అయ్యాయి. ఇదేకాలంలో చెన్నైలో లగ్జరీ  రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు 920 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే 2019లో 300 లగ్జరీ ఇండ్లు, 2020లో 120 యూనిట్లు  2021లో 660 యూనిట్ల అమ్ముడయ్యాయి. కోల్‌‌కతాలో లగ్జరీ రెసిడెన్షియల్ విభాగంలో 630 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019లో 390 లగ్జరీ యూనిట్లు, 2020లో 90 యూనిట్లు  2021లో 490 యూనిట్లు అమ్ముడయ్యాయి.

తక్కువ ధరల ఇండ్ల డిమాండ్​ కొంత తగ్గింది...
మొత్తం అమ్మకాల్లో లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ వాటా పెరగడంతో, తక్కువ ధర ఇండ్ల వాటా (రూ. 40 లక్షల కంటే తక్కువ ధర కలిగిన యూనిట్లు) తగ్గింది. 2019లో మొత్తం అమ్మకాల్లో వీటి 38 శాతం కాగా, 2022 మొదటి ఆరు నెలల్లో ఇది 31 శాతానికి పడిపోయింది. కరోనా తరువాత తక్కువ ధర ఇండ్ల అమ్మకాలు బాగా పడ్డాయి. మహమ్మారి వల్ల ఈ వర్గంలోని కొనుగోలుదారులు చాలా నష్టాన్ని చవి చూశారు. గడచిన 10 సంవత్సరాల డేటా ప్రకారం, ఈ ఏడు నగరాల్లో మొత్తం ఇండ్ల అమ్మకాలు 2013లో 3,18,399 యూని ట్లుగా ఉన్నాయి; 2014 సంవత్సరంలో 3,42,983 యూనిట్లు; 2015 సంవత్స రంలో 3,08,250 యూనిట్లు; 2016 సంవ త్సరంలో 2,39,260 యూనిట్లు; 2017 సంవత్సరంలో 2,11,143 యూనిట్లు; 2018 సంవత్సరంలో 2,48,311 యూని ట్లు; 2019 సంవత్సరంలో 2,61,358 యూనిట్లు; 2020 సంవత్సరంలో 1,38,344 యూనిట్లు; 2021 సంవత్స రంలో 2,36,516 యూనిట్లు అమ్ముడు పోయాయి. 2022 మొదటి ఆరు నెలల్లో అమ్ముడైన మొత్తం యూనిట్ల సంఖ్య 1,84,475. ఈ ఏడాదిలో ఇండ్ల అమ్మకాలు మహమ్మారి ముందు ఉన్న స్థాయిని అధిగమించే అవకాశం ఉందని అనరాక్ తెలిపింది. మంచి డిమాండ్  కారణంగా ఈ ఏడు నగరాల్లో ఇన్వెంటరీ దాదాపు 9 లక్షల యూనిట్ల నుంచి  దాదాపు 6 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ఈ డేటాలో అన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌‌లు (అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, రో-హౌస్‌‌లు, విలమెంట్  ఇండిపెండెంట్ ఫ్లోర్‌‌లు) ఉన్నాయి. ప్లాట్ చేసిన డెవలప్‌‌మెంట్ ప్రాజెక్ట్‌‌లు లేవు.