OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్.. ఒకటి రూ.800 కోట్లు కొల్లగొడితే, మరొకటి రూ.300 కోట్లు

OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్.. ఒకటి రూ.800 కోట్లు కొల్లగొడితే, మరొకటి రూ.300 కోట్లు

ఓటీటీల్లో ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వీకెండ్ కూడా (2025 అక్టోబర్31న) కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ సక్సెస్ను సాధించాయి. అందులో ఒకటి మలయాళ ఫిల్మ్ 'కొత్తలోకా చాప్టర్ 1' కాగా మరొకటి కాంతారా చాప్టర్ 1. ముఖ్యంగా ఈ సినిమాలు, థియేటర్ ఆడియన్స్ని మెప్పించడమే కాకుండా, ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేశాయి. గత సినిమాల రికార్డులనే కాదు.. కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసి సత్తా చాటుకున్నాయి. మరి ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్కి వచ్చాయో ఓ లుక్కేద్దాం. 

కొత్తలోకా చాప్టర్ 1 ఓటీటీ:

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో లేడీ సూపర్ హీరో బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కింది. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించి అదరగొట్టింది. నస్లేన్ కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌‌గా విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ, ఇవాళ (అక్టోబర్31న) ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.  తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేసి మంచి లాభాలు గడించింది. 

కథాంశం:

చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) అనే అమ్మాయికి కొన్ని అతీంద్రయ శక్తులుంటాయి. ఈ పవర్స్‌ను దాచిపెట్టుకుని సాధారణ జీవితం గడపడానికి బెంగళూరుకు వస్తుంది. ఒక కేఫ్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమెకు, ఎదురింట్లో ఉండే సన్నీ (నస్లేన్) పరిచయమవుతాడు. ఈ పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో, అనుకోని సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఆమె ఎవరు? ఆమె శక్తులకు కారణమేంటి? పోలీస్ ఆఫీసర్ నాచియప్ప (శాండీ)తో ఆమెకు ఉన్న గొడవ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

కాంతారా చాప్టర్ 1 ఓటీటీ:

'కాంతార: చాప్టర్ 1'.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించి వెళ్ళింది. 2025 ఆక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 830 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన వినూత్న శైలిని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఇవాళ (ఆక్టోబర్ 31న) 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి రానుంది.

ఇదిలా ఉంటే.. కాంతార:చాప్టర్ 1 ఇవాళ అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్లో థియేటర్లో విడుదల కానుంది. ప్రపంచ ఆడియన్స్కు నచ్చేలా, క్రిస్పీ రన్‌టైమ్‌తో ఇంగ్లిష్‌ వెర్షన్లో తీసుకురానున్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న నిడివి 2 గంటల 49 నిమిషాలను.. ఇపుడు ఇంగ్లిష్‌ వెర్షన్‌లో 2:14 గంటల రన్‌టైమ్‌తో తీసుకొస్తున్నారు. మరి ఈ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఎలాంటి సీన్స్ తొలిగించారో తెలియాలంటే, కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే!

ALSO READ :  ట్రెండింగ్లో ‘జూమ్ షరాబీ’ వీడియో సాంగ్..

హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.