 
                                    గూడూరు, వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏవో అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల మండలంలో వరి సుమారు 980ఎకరాల్లో , పత్తి 190ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేసినట్లు చెప్పారు.

 
         
                     
                     
                    