
అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట సివిల్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న సర్జికల్ క్యాంప్‌లో ఇప్పటి వరకు 250 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేసినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల చివరి వరకు మెగా సర్జికల్ క్యాంప్ కొనసాగుతుందని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూపరింటెండెంట్ ప్రభు, వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాస్, డీసీహెచ్ రామకృష్ణ, డాక్టర్ శ్రీనివాసులు సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.
చదువుతో పాటు క్రీడలు అవసరం
ఉప్పునుంతల: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలమూరు ఎన్నారై ఫోరం అందజేసిన మండలలోని 32 పాఠశాలలకు 117 చెస్ బోర్డులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు పాలమూరు ఎన్నారై ఫోరం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంఈవో చంద్రశేఖర్, ఫోరం సభ్యులు మాధవరం కరుణాకర్, చెల్లా శేఖర్, రవి ప్రకాశ్, రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.