
లక్నో: హోంగార్డుల తొలగింపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉత్తరప్రదేశ్ హోమ్ గార్డ్ మంత్రి చేతన్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ కొరత కారణంగా హోమ్ గార్డులను తొలగించకుండా, వారి పని దినాల్ని మాత్రమే తగ్గిస్తామని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని పోలీసు శాఖకు చెందిన 25 వేల మంది హోమ్‌గార్డ్‌ల సేవలను ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం రద్దు చేశారని వార్తలొచ్చాయి. అయితే దీనికి సంబంధించి హోంశాఖ నుండి ఎలాంటి అధికారిక లేఖ రాలేదని మంత్రి చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎవరినీ వారి ఉద్యోగాల నుండి తొలగించబోమని చెప్పారు.బడ్జెట్ పరిమితుల కారణంగా, పని దినాల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ, హోమ్ గార్డ్ ల సేవ రద్దు చేయబడదని చౌహాన్ అన్నారు.
“మాకు హోంశాఖ నుండి అధికారిక లేఖ రాలేదు. ఎవరినీ వారి ఉద్యోగాల నుండి తొలగించబోమని నేను హామీ ఇస్తున్నాను. అధికారిక నిర్ణయం తీసుకోలేదు. బడ్జెట్ పరిమితి కారణంగా, పని రోజులు 30 నుండి 20-22కి తగ్గించబడతాయని ” చౌహాన్ అన్నారు.