సాగర్‌‌‌‌కు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

సాగర్‌‌‌‌కు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో
  • 26 గేట్లు ఓపెన్‌‌‌‌ చేసి నీటి విడుదల

హాలియా/మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌కు ఎగువ నుంచి వరద భారీ స్థాయిలో వస్తోంది. రిజర్వాయర్‌‌‌‌లోకి 2,30,540 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 22 గేట్లను ఐదు అడుగులు, నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,34,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు588.90 అడుగులు (3‌‌‌‌‌‌‌‌.7614 టీఎంసీల) నీరు ఉంది. సాగర్‌‌‌‌ నుంచి ఎడమ కాల్వకు 2,557 క్యూసెక్కులు, కుడి కాల్వకు 4,050, ఏఎమ్మార్పీకి 1,800, విద్యుత్‌‌‌‌ఉత్పత్తికి 28,339 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,71,596 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 

ప్రాజెక్ట్‌‌‌‌ మొత్తం గేట్లను ఓపెన్‌‌‌‌ చేయడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సాగర్‌‌‌‌ పరిసరాలను చూస్తూ సెల్ఫీలు దిగారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలోని పులిచింతల ప్రాజెక్ట్‌‌‌‌కు 3,15,466 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. దీంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 170.8 అడుగుల నీరు నిల్వ ఉంది.

మూసీ గేట్లు ఓపెన్‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : వర్షాల కారణంగా నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్‌‌‌‌కు భారీ గా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల మేర నీరు చేరింది. ఎగువ నుంచి 6477.78 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండడంతో ఆఫీసర్లు ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.