
- పరారీలో మరో ఇద్దరు
- మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.4 లక్షల విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సుధీర్రాంనాథ్కేకన్శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మానుకోట టౌన్ జ్యోతిబసు నగర్ కాలనీలో రాజగోపాల్కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
శాయంపేటకు చెందిన రవీందర్గతంలో మధ్యప్రదేశ్ లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి వరంగల్ ఏరియాలో అమ్మేవాడు. దీంతో అతనికి నాగపూర్‌కు చెందిన ఆశిష్ఠాకూర్ తో పరిచయం ఏర్పడింది. కాగా.. రవీందర్‌కు బ్యాంకు లోన్లు, క్రెడిట్‌కార్డుల ఇప్పించేక్రమంలో ఖమ్మంకు చెందిన సాబిర్ పాషాతో పరిచయం ఉండగా.. ముగ్గురూ కలిసి కల్తీ మద్యం తయారు చేసి అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు.
ఠాకూర్ వద్ద రూ.1.50లక్షలతో స్పిరిట్కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. వీరితో పాటు వరంగల్‌కు చెందిన ములుగు రాజు, రామ్‌తేజ, గార్ల మండలం పెద్ద కిష్టాపురానికి చెందిన ఓర్సు కృష్ణ, జక్కుల రమేశ్ముఠాగా ఏర్పడ్డారు. జ్యోతిబసునగర్కాలనీలో రాజగోపాల్ గౌడౌన్ ను ఎలక్ర్టికల్స్టోర్కోసమని చెప్పి అద్దెకు తీసుకున్నారు.
స్పిరిట్‌లో కలర్ కెమికల్ కలిపి 2,688 లీటర్ల కల్తీ మద్యం తయారు చేశారు. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఓర్సు కృష్ణ, సాబీర్‌పాషా, జక్కుల రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు, రామ్‌తేజ, ఆశిష్ ఠాకూర్పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.