
నేపాల్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి 27 మృతి చెందగా..500 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు సహాయక సిబ్బంది. తుఫాన్ దాటికి దక్షిణ నేపాల్ లోని బారా, పర్సా జిల్లాల్లో వేలాది మంది చిక్కుకున్నారు. కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు జిల్లాల్లో చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్మీ ,పోలీసు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తుఫాన్ తీవ్రతపై స్పందించిన నేపాల్ ప్రధాని ఖద్గా ప్రసాద్ ఓలి..బాధితు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.