హైదరాబాద్, వెలుగు: లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ ఎగ్జామ్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేజీబీవీలకు చెందిన 27 మంది విద్యార్థినులు అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం కేజీబీవీకి చెందిన బి. గాయత్రి రాష్ట్ర స్థాయిలో 948వ ర్యాంకు సాధించింది. మరో 26 మంది విద్యార్థినులు కూడా 5,000 లోపు ర్యాంకులు సాధించారు. కాగా, క్వాలిఫై అయిన విద్యార్థినులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారు.
