ఎన్​కౌంటర్​ మృతుల్లో 14 మంది మహిళలు

ఎన్​కౌంటర్​ మృతుల్లో 14 మంది మహిళలు
  • వివరాలు వెల్లడించిన చత్తీస్​గఢ్​ అధికారులు
  • నారాయణ్​పూర్​కు మృతదేహాల తరలింపు
  • ఇద్దరు జవాన్లు కూడా మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని అబూజ్​మడ్​ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మృతిచెందిన మావోయిస్టుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్ట్​ పార్టీ చీఫ్​ కమాండర్​ నంబాల కేశవరావు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలను  ఆర్మీ హెలీకాప్టర్​లో గురువారం నారాయణపూర్​కు తరలించారు. జోరు వాన కారణంగా మృతదేహాల తరలింపు సమస్యగా మారడంతో హెలికాప్టర్​లో తెచ్చారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. రమేష్​ హేమ్లా, కోట్లూరాం కొర్రాం అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారని తెలిపారు. 

అబూజ్​మాడ్​లో ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని, మావోయిస్టుల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. కేంద్ర బలగాలతో కలిసి చత్తీస్​గఢ్​ రాష్ట్ర పోలీసుల జాయింట్​ ఆపరేషన్​ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు అలియాస్​ గంగన్న, జంగ్​ పత్రిక ఎడిటర్​ సజ్జ నాగేశ్వరరావు అలియాస్​ నవీన్​, కమాండర్​ రోషన్​ టిప్పు తదితరులు ఉన్నారు.  మావోయిస్టులతో జరుగుతున్న పోరాటంలో జవాన్లు చూపిస్తున తెగువ, ధైర్యం వెలకట్టలేనివని చత్తీస్​గఢ్​ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్​శర్మ అన్నారు. గురువారం ఆయన నారాయణ్​పూర్​ జిల్లా కేంద్రంలో జవాన్లు రమేష్​ హేమ్లా, కోట్లూరాం కొర్రాం మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మావోయిస్టులు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఈ సందర్భంగా విజయ్​ శర్మ తెలిపారు. 

మృతిచెందిన మావోయిస్టులు వీరే..    

  • నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు అలియాస్​ గంగన్న- (మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి)
  • సజ్జ నాగేశ్వరరావు అలియాస్​ జంగు నవీన్​ అలియాస్​ మధు- (జంగు పత్రిక ఎడిటర్​, ఎస్​జెడ్సీ​ఎం)
  • రోషన్​ అలియాస్​ టిప్పు- (కమాండర్)​
  • రాజు
  • విజా కుర్సం
  • రాజేష్​ తెల్లం
  • సునీల్​
  • బద్రూ అలియాస్ ఓదా
  • సరిత
  • కోసి అలియాస్​ క్రాంతి మడవి
  • గీత
  •  సంగీత
  • సోమ్లీ అలియాస్​ సజంతి అలియాస్​ హిడ్మే ఉడ్సా
  • గుడ్డు అలియాస్ ఉంగా
  • జుగ్గో అలియాస్​ జమున పొడియం
  • బుచ్చి అలియాస్​ రమే
  • భూమిక
  • ఐతే అలియాస్​ రాగో అలియాస్​ వెకో
  • కోసా హోడీ అలియాస్​ నగేష్​
  • రవి
  • భీమే అలియాస్​ మాసీ మండవి
  • కల్పన​ అవలం
  • కమల పద్దాం అలియాస్​ లక్ష్మీ
  • ఉపేంద్ర అలియాస్​ వివేక్​
  • ఛోటీ అలియాస్​ రేష్మా పొడియం
  • హిడ్మే అలియాస్​ సంకీ ముచ్చకీ
  • సూర్య అలియాస్​ సంతూ