కేటి దొడ్డి, వెలుగు: 28 గొర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించిన ఘటన కేటి దొడ్డి మండలం పరిధిలోని మల్లాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్ వివరాల మేరకు.. మల్లాపురం గ్రామానికి చెందిన తిరుమలేశు తన గొర్రెలను గురువారం మేపి రాత్రి భారత్మాల రోడ్డు పక్కన వలవేసి వదిలి ఇంటికి వచ్చాడు.
శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల మందు దగ్గరికి వెళ్లి చూడగా 28 గొర్రెలను గుర్తు నేను వ్యక్తులు దొంగతనం చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
