24 గంటల్లో 2.11లక్షల కేసులు..డిశ్చార్జ్ 2.83 లక్షలు

24 గంటల్లో 2.11లక్షల కేసులు..డిశ్చార్జ్ 2.83 లక్షలు

దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కరోనా కేసులు నిన్నటితో పోల్చితే ఇవాళ కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 11 వేల 298 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 73 లక్షల 39 వేల 93 మందికి పెరిగింది. ఇక నిన్న 3 వేల 847 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3 లక్షల 15 వేలు దాటింది. నిన్న దేశవ్యాప్తంగా 2 లక్షల 83 వేల 135 మంది డిశ్చార్జ్ కాగా...ఇప్పటివరకూ 2 కోట్ల 46 లక్షల 33 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24 లక్షల 19 వేల 901 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా  20 కోట్ల 26 లక్షల 95 వేల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.