ఒడిశా ఐటీ సోదాల్లో 290 కోట్లు సీజ్..

ఒడిశా ఐటీ సోదాల్లో 290 కోట్లు సీజ్..

న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన బౌధ్ డిస్టిలరీ గ్రూప్ కంపెనీలపై జరిపిన దాడుల్లో ఐటీ డిపార్ట్ మెంట్ రూ.290 కోట్లు సీజ్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. సింగిల్ ఆపరేషన్ లో ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ సీజ్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని ఐటీ వర్గాలు శనివారం పేర్కొన్నాయి. జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు, అతని బంధువులకు చెందిన కంపెనీలు, ఇండ్లలో మూడ్రోజుల పాటు ఐటీ డిపార్ట్ మెంట్ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకుంది. 

స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కిస్తున్నం. మొత్తం రూ.290 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు రూ.250 కోట్లు కౌంటింగ్ చేశాం. కౌంటింగ్ చేసిన డబ్బును ఒడిశాలోని గవర్నమెంట్ బ్యాంకులకు తరలిస్తున్నాం” ఐటీ అధికారులు తెలిపారు. కాగా, ఇంతకుముందు 2019లో కాన్పూర్ కు చెందిన బిజినెస్ మెన్ కంపెనీలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ రెయిడ్స్ చేసి రూ.257 కోట్లు స్వాధీనం చేసుకుంది. 2018 జులైలో తమిళనాడుకు చెందిన కన్ స్ట్రక్షన్ సంస్థపై ఐటీ శాఖ దాడులు చేసి రూ.163 కోట్లు సీజ్ చేసింది.