రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..మార్చి 7న అత్యధికంగా 298 మిలియన్​ యూనిట్లు సప్లయ్​

రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..మార్చి 7న అత్యధికంగా 298 మిలియన్​ యూనిట్లు సప్లయ్​
  • బుధవారం అత్యధికంగా 298.19 మిలియన్​ యూనిట్లు సప్లయ్​
  • ఈ నెలలో మరింత పెరిగే చాన్స్‌
  • ఇప్పటికే 15 వేల మెగావాట్లు క్రాస్
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీగా వాడకం

హైదరాబాద్‌, వెలుగు: కరెంటు సరఫరాలో డిస్కంలు  రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు రెండు డిస్కంల పరిధిలో ఎన్నడూలేని విధంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. ఇప్పటి వరకు నిరుడు మార్చి 14న 297.89 మిలి యన్​ యూనిట్ల విద్యుత్  సరఫరానే రాష్ట్రంలో అత్యధి కం. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్  వినియోగదారులకు 298.19 మిలియన్  యూనిట్ల కరెంటు సరఫరా చేసి డిస్కంలు గత రికార్డులను చెరిపేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ   పంపుసెట్ల వినియోగం పెరగడం వంటి కారణాల వల్ల అన్ని కేటగిరీల్లో కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత  పరిస్థితుల్లో డిమాండ్‌  మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగం మరికొద్దీ రోజుల్లో 300 మిలియన్  యూనిట్లు దాటే చాన్స్​ ఉందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

రోజువారీగా 15 వేల మెగావాట్ల డిమాండ్‌ 

ఈ ఏడాది మార్చి ఒకటి నుంచే 15 వేల మెగావాట్లు దాటి విద్యుత్​ డిమాండ్  రికార్డువుతున్నది. బుధవారం అత్యధికంగా 15,403 విద్యుత్  డిమాండ్  నమోదైంది. ఇది నిరుటి కన్నా 573 మెగావాట్లు అదనం. నిరుడు మార్చి 3న 14,856 మెగావాట్ల గరిష్ట డిమాండ్  నమోదైంది. ఇక గ్రేటర్‌  హైదరాబాద్‌  పరిధిలో బుధవా రం అత్యధికంగా 69.31 మిలియన్  యూనిట్ల కరెంటు వినియోగం జరిగింది. ఈ సీజన్​లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ  పరిధిలో నిరుడు ఇదే టైమ్‌లో 59.53 మిలియన్  యూనిట్ల వినియోగం జరిగింది. నిరుడు మార్చి 6న అత్యధికంగా 2910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది మార్చి 1 నుంచే  3 వేల మెగావాట్లకు పైగా డిమాండ్  నమోదవుతోంది. బుధవారం ఈ సీజన్ లో అత్యధికంగా 3,335 మెగావాట్ల డిమాండ్  నమోదైంది. 

ప్రతిపక్షాల విమర్శలపై సర్కారు సీరియస్‌

కాంగ్రెస్​సర్కారు వచ్చిన కొత్తలోనే విద్యుత్​ లైన్ల మెయిం టెనెన్స్ కోసం కరెంటు సరఫరా నిలిపివేస్తూ రిపేర్లు చేశారు. దీంతో కాంగ్రెస్  వచ్చింది.. కరెంటు పోయింది అని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో అధికారులపై సర్కారు సీరియస్​ అయింది. గతంకన్నా అత్యధిక విద్యుత్  సప్లై జరుగుతున్నా విమర్శలు రావడంతో చీటికి మాటికి కరెంటు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమై అ త్యవసర పరిస్థితుల్లో మినహా కరెంటు నిలిపివేయడం లేదు. కాగా, ఈ నెలలో అత్యధిక డిమాండ్  వ చ్చే చాన్స్​ ఉండడంతో విద్యుత్  సంస్థలు దానికి తగిన విధంగా కరెంటు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.