
ముంబై: ఈ వారంలో మూడు ఎస్ఎంఈలు ఐపీఓకు వస్తున్నాయి. ఇన్ఫోలియాన్ రీసెర్చ్ సర్వీసెస్, సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్, కామ్రేడ్ అప్లయెన్సెస్లు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ)లతో ఫండ్స్ సమీకరించనున్నాయి. ఈ ఐపీఓలు బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్టింగవుతాయి. ఎస్ఎంఈ ఐపీఓకి వెళ్లాలంటే ఇష్యూ అనంతరపు పెయిడ్ అప్ ఈక్విటీ రూ. 25 కోట్ల కంటే తక్కువ ఉండటంతో పాటు, కనీసం రూ. 1 కోటిగా ఉండాలి. ఐపీఓ ఫార్మ్స్‌ను బ్రోకర్లు లేదా బ్యాంకులు, లేదంటే యూపీఐ బేస్డ్ ఐపీఓ అప్లికేషన్స్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.ఇన్ఫోలియాన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ సోమవారం మొదలై, బుధవారంతో ముగియనుంది.
ఈ కంపెనీ రూ. 80–రూ. 82 ను ప్రైస్ బ్యాండ్‌గా ఫిక్స్ చేసింది. ఐపీఓ కింద 22.24 లక్షల షేర్లను జారీ చేయనున్నారు. సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ఓపెనై, శుక్రవారం క్లోజవుతుంది. కామ్రేడ్ అప్లయెన్సెస్ రూ. 12.30 కోట్ల ఫండ్స్ సమీకరణ కోసం ఐపీఓకి వస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ ఈ బుధవారం మొదలై, ఆ తర్వాత సోమవారం ముగియనుంది. షేర్ ఒక్కింటికి రూ. 52–రూ. 54 ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణయించారు.