మనమే లేటు : మనుషుల వినియోగంలోకి వచ్చేస్తోంది AI

మనమే లేటు : మనుషుల వినియోగంలోకి వచ్చేస్తోంది AI

కృత్రిమ మేధస్సు(AI) రంగంలో ఫిబ్రవరి 7 ఓ ప్రత్యేకమైన రోజు.. ఇవాళ అనేక ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళకు చెందిన ఓ డీప్ టెక్ స్టార్టప్.. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ , అవార్డ్స్ 2024లో AI లో ఉత్తమ పరిశోధన సంస్థగా అవార్డును అందుకుంది. మరోవైపు ప్రపంచంలోని ప్రతి మూలలో AI వ్యాప్తి చేసే ప్రయత్నంలో AI నిబంధనలపై సహకరించాలని మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల భారత్, అమెరికాలను కోరారు. అదేవిధంగా చాట్ జిపీటి డాల్ -3 మోడల్ తో రూపొందించిన చిత్రాల మెటాడేటాకు వాటర్ మార్కులను జోడిస్తుందని ఓపెన్ ఏఐ బుధవారం (ఫిబ్రవరి7) తెలిపింది. 

AI  నిబంధనలపై సహకరించాలని భారత్, అమెరికాలను కోరిన సత్య నాదెళ్ల 

AI  నిబంధనలపై భారత్ , అమెరికా సహకరించాలని బుధవారం (ఫిబ్రవరి 7) మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల కోరారు. బుధవారం ముంబైలోని తాజ్ మహల్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో నాదెళ్ల మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి మూలలో AI వ్యాప్తికి భారత్, అమెరికాలు కీలకమని అన్నారు. ముఖ్యంగా భారత్, యూనైటెడ్ స్టేట్స్ పరస్సరం సహకరించుకోవడం తప్పని సరి అని అన్నారు సత్య నాదెళ్ల . 

కేరళ స్టార్టప్ కు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అవార్డ్ 2024

ఇంటర్నేషనల్ వర్చువల్ అసిస్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేరళలోని డీప్ టెక్ స్టార్టప్, గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2024లో AI ఇన్ బెస్ట్ రీసెర్చ్ కంపెనీ అవార్డును గెలుచుకుంది. ఇది అందరి గుర్తింపు పొందింది. ఇండియా కౌన్సిల్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆలోమేషన్ ఏరో ఇంజిన్ టెస్టింగ్ కోసం వర్చువల్ స్ట్రెయిన్ గేజ్ సెన్సార్ ను అభివృద్ధి చేయడానికి ఈ స్టార్టప్ కృషి చేసింది. 

AI మోడల్ను అభివృద్ధి చేయడంలో థాయిలాండ్ ముందంజ 

విదేశీ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో థాయిలాండ్ తన స్వంత AI మోడల్ ను అభివృద్ధి చేయడంలో పురోగతి సాధిస్తోంది. ఓపెన్ థాయ్ జిపీటీగా పిలువబడే AI మోడల్ అభివృద్ధి, నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ సెంటర్ (NECTEC) కి చెందిన చై వుటివివాట్ చై నేతృత్వంలో అభివృద్ధి చేయబడింది. ఈ ప్రాజెక్టు 2023 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ , NSTDA సూపర్ కంప్యూటర్ సెంటర్ సహకారంతో ప్రారంభించబడింది.