వచ్చే నెల 27 నుంచి గుజరాత్లో రాష్ట్ర కథా శిబిర్

వచ్చే నెల 27 నుంచి గుజరాత్లో రాష్ట్ర కథా శిబిర్
  • ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది విద్యార్థులు 
  • ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికారులు 

హైదరాబాద్, వెలుగు:ఈ మేరకు ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయాలని డీఈఓలను సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఆమె ఉత్తర్వులు జారీచేశారు. గుజరాత్​లోని ప్రాన్సల గ్రామంలోని శ్రీ వేదిక్ మిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఈ శిబిరం జరగనున్నదని తెలిపారు. దీనికి సంబంధించి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 15 మంది బాలికలు, 15 మంది బాలురను ఎంపిక చేయాల్సి ఉంది.  రా ష్ట్రంలోని సర్కారు స్కూల్ స్టూడెంట్లకు గుజరాత్ వెళ్లే చాన్స్ దక్కింది. గుజరాత్​లోని రాజ్​కోట్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘రాష్ట్ర కథా శిబిర్’లో పాల్గొనేందుకు విద్యార్థులను నామినేట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

చదువులో మెరిట్ తో పాటు ఆసక్తి, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులనే ఈ ప్రోగ్రామ్​కు ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థులను గుజరాత్ తీసుకెళ్లడానికి, వారి బాగోగులు చూసుకోవడానికి ప్రతి జిల్లా నుంచి ఇద్దరు టీచర్లను కూడా నియమించాలని ఆదేశించారు. ఈ క్యాంప్​కు వెళ్లే విద్యార్థుల పేరెంట్స్ నుంచి తప్పనిసరిగా అంగీకారపత్రం తీసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల పేర్లు, తరగతి, స్కూల్ వివరాలతో కూడిన పూర్తి జాబితాను త్వరగా స్టేట్ ఆఫీసుకు పంపించాలని ఆదేశించారు. జాతీయ సమైక్యత, సంస్కృతి, దేశభక్తిని పెంపొందించేలా ఈ క్యాంప్ ఉంటుందని అధికారులు తెలిపారు.