తెలంగాణలో 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 63,120 కరోనా టెస్టులు నిర్వహించగా 3,308 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా GHMC పరిధిలో 513 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,723 మంది కరోనా నుంచి కోలుకోగా, 21 మంది చనిపోయారు. 

తెలంగాణలో ఇప్పటివరకు 5,51,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 5,04,970 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 42,959 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,106కి చేరింది. రికవరీ రేటు 91.64శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.