నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్​

నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్​
  • ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డే కారణమంటున్న సిబ్బంది

ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్​తో 36 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం స్టూడెంట్లు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో వారికి స్కూల్​ క్యాంపస్​లో  చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్​ చంద్రబాబు మాట్లాడుతూ.. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన స్టూడెంట్లు వచ్చేటపుడు పిండివంటలు తెచ్చుకున్నారని, వాటి కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని, ఎటువంటి ప్రమాదం లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఫుడ్​ఇన్స్​పెక్టర్​కిరణ్​కుమార్​విద్యాలయాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన స్టూడెంట్ల దగ్గర ఉన్న ఫుడ్​శాంపిల్స్​తీసుకుని పరీక్షకు పంపించారు. ఇండ్ల నుంచి తెచ్చిన పిండివంటలే కారణమైతే కొద్దిమందికి లేదా ఒకే క్లాస్​ పిల్లలకు అవుతుందని, అన్ని క్లాసుల పిల్లలు ఎలా అస్వస్థతకు గురవుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యాలయంలో వడ్డించిన ఫుడ్​వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. వెంటనే స్టూడెంట్లను ఖమ్మం సిటీలోని పెద్దాసుపత్రికి తరలించాలని డిమాండ్​ చేశారు.