- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి జేఎన్జే హౌసింగ్ సొసైటీ డైరెక్టర్స్ వినతి
హైదరాబాద్, వెలుగు: పేట్బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాలు జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి అప్పగించేలా చొరవ తీసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి చేశారు. భూమిని సొసైటీకి కేటాయించాలని పలుమార్లు సుప్రీం కోర్టు కూడా సూచించిందని గుర్తు చేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్ బొమ్మగాని కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆర్.రవికాంత్ రెడ్డి, సీఈవో ఎన్.వంశీ శ్రీనివాస్, డైరెక్టర్స్ పీవీ రమణ రావు, అశోక్ రెడ్డి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. 2008 నుంచి జరిగిన పరిణామాలు, ప్రభుత్వానికి మార్కెట్ ధర ప్రకారం రూ.12.33 కోట్ల చెల్లింపు, 70 సొసైటీకి అప్పగించాల్సిందిగా వివిధ దశల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల గురించి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన జీవో, సుప్రీం కోర్టు తీర్పు కాపీలను అందజేశారు.
