Rishabh Pant : పంత్ కు 4వేలు తిరిగి ఇచ్చిన యువకులు

Rishabh Pant : పంత్ కు 4వేలు తిరిగి ఇచ్చిన యువకులు

రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన సమయంలో సాయపడ్డ ఇద్దరు యువకుల నిజాయితీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పంత్ కారు ప్రమాదం జరిగిన సమయంలో రజత్ కుమార్, నిషు కుమార్ అనే యువకులు పంత్  వస్తువులు, నగదును మంటల్లో కాలిపోకుండా బయటకు తీశారు. తాజాగా ఆ వస్తువులు, రూ. 4వేల నగదును పోలీసులకు అందించారు. దీంతో యువకుల నిజాయితీని పోలీసులు అభినందించారు.  

యాక్సిడెంట్ తరువాత రిషబ్ పంత్ మ్యాక్స్ హాస్సిటల్లో చికిత్స పొందుతున్నాడు. పంత్ వస్తువులను పోలీసులకు అప్పగించిన రజత్ కుమార్, నిషు కుమార్లు.. ఆ తర్వాత రిషభ్ను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంత్ వస్తువులను, నగదును తీసి..నిజాయితీగా అప్పగించిన యువలకుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శభాష్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. 

డిసెంబర్ 30న ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కు కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో అతడికి రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు యువకులు సహాయం చేశారు. యాక్సిడెంట్ అయ్యాక పంత్ పరిస్థితి విషమంగా ఉందని..అప్పుడు సుశీల్ అనే బస్ డ్రైవర్, కండక్టర్ పరమ్ జీత్ అంబులెన్స్ కు ఫోన్ చేశారని యువకులు తెలిపారు. ఆ సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తి పంత్ అని తమకు తెలియదన్నారు. కానీ అతని ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించామని చెప్పారు. పంత్ శరీరంపై దుప్పటి వేసి అంబులెన్స్ లోకి ఎక్కించామని వివరించారు.