బీహార్​లో ఒవైసీకి షాక్

బీహార్​లో ఒవైసీకి షాక్
  • ఆర్జేడీలో చేరనున్న నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు  

పాట్నా: బీహార్​లో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భారీ షాక్ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఎంఐఎంకు ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీలోకి చేరే సూచనలు ఉన్నాయి. 2021 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు పోటీ చేసిన మజ్లిస్ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. అప్పటి నుంచి తమ భవిష్యత్తుపై బీహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో మునిగారని, అందుకే వారు ఆర్జేడీతో టచ్​లోకి వచ్చారని చెప్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20 నియోజకవర్గాల్లో ఆర్జేడీ ఓటు బ్యాంకును మజ్లిస్ చీల్చింది. కానీ యూపీలో మాత్రం ముస్లిం ఓటర్లు మజ్లిస్ వైపు మొగ్గుచూపలేదు. దీంతో బీహార్ లో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా ఓడిపోవచ్చని మజ్లిస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. అందుకే సేఫ్ సైడ్ గా ముందుగానే ఆర్జేడీలో చేరాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ తమను చేర్చుకునేందుకు పెద్ద పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ఎంఐఎంను విడిచిపెట్టి వెళ్లబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్తరుల్ ఇమామ్ అన్నారు.