కరీంనగర్ లో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు

కరీంనగర్ లో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
  •      మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీ అభివృద్ధే బల్దియా లక్ష్యమని, ఎక్కువ ఫండ్స్​ కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గురువారం 16, 24, 48 డివిజన్లలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌‌తో కలిసి మేయర్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ జనాలకు అందుబాటులో ఉండేలా రూ.40కోట్లతో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ రూ.132కోట్లతో త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, తిరుపతి, షఖీరా బర్కత్ అలి, అనూప్,  ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, మహేందర్ పాల్గొన్నారు.