దారుణం.. చేతబడి చేస్తున్నారని నలుగురి తలలు నరికేశారు

దారుణం.. చేతబడి చేస్తున్నారని నలుగురి తలలు నరికేశారు

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఊళ్లోని నలుగురు వ్యక్తులు తెల్లారేసరికి శవాలై తేలారు. గుమ్లాజిల్లాలోని ఓ ఊళ్లో ఓ కుటుంబాన్నే చంపేశారు దుండగులు. ఆ ఇంటి ఆవరణలో.. నలగురుు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు భయపడిపోయారు. పోలీసులకు విషయం చెప్పారు.

గుమ్లా ఎస్పీ అంజనీకుమార్ ఝా నేతృత్వంలోని టీమ్ సంఘటనా స్థలానికి వచ్చింది. డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కు పంపించారు. మంత్రగాళ్లు అనే నెపంతోనే ఈ నలుగురి హత్య జరిగినట్టు ఎస్పీ చెప్పారు. చేతబడి, బాణామతి చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ హత్యలు చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. తలలు నరికి అత్యంత కిరాతకంగా చంపేశారని.. ఈ మారణ కాండలో 12 మంది దుండగులు పాల్గొన్నట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు ఎస్పీ.