వంతెనపై నుంచి లోయలో బస్సు పడి 40మంది మృతి

 వంతెనపై నుంచి లోయలో బస్సు పడి 40మంది మృతి

పాకిస్తాన్‌లో వంతెనపై నుంచి లోయలో బస్సు పడి మంటలు చెలరేగడంతో దాదాపు 40 మంది మరణించారు. ఈ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంగా ఉన్నాయని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని లాస్బెలా జిల్లాకు చెందిన సీనియర్ అధికారి హమ్జా అంజుమ్ అన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న ఈ బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేగంగా బస్సు బస్సు ఒక్కసారిగా వంతెనపై ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టి, దారి తప్పడంతోనే బస్సు లోయలో పడిపోయిందని అంజుమ్ తెలిపారు.

ఈ ప్రమాదానికి పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. మామూలుగా ప్యాసింజర్ బస్సులు తరచుగా సామర్థ్యానికి మించి కిక్కిరిసి ఉండడం చూస్తూనే ఉంటాం. అదే మాదిరిగా ఈ బస్సులోనూ మంది ఎక్కువగా ఉండడంతో ప్రాణనష్టం కూడా ఆ స్థాయిలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 2018లో పాకిస్తాన్ రోడ్లపై 27,000 మందికి పైగా మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం తెలుస్తోంది.