బాలీవుడ్ లో కరణ్ జోహర్ పార్టీ కలకలం

బాలీవుడ్ లో కరణ్ జోహర్ పార్టీ కలకలం

ముంబై: బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో పాల్గొన్న హీరోయిన్ లు కరీనా కపూర్, అమృతా అరోరా, యాక్టర్ సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్, యాక్టర్ సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ లకు కరోనా పాజిటివ్ రావడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది. కరణ్ తల్లి హిరూ జోహర్, 10 మంది స్టాఫ్ తో సహా పార్టీలో పాల్గొన్న 40 మందికి ముంబై మున్సిపల్ అధికారులు మంగళవారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. కరణ్ ఇంటిని పూర్తిగా శానిటైజ్ చేశారు. కరణ్ జోహర్ కు ఇదివరకే కరోనా నెగెటివ్ వచ్చింది. కరీనా, అమృతకు ఆదివారం పాజిటివ్ రావడంతో బృహన్​ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వారి వారి ఇండ్లలో టెస్టింగ్ క్యాంపులు నిర్వహించారు. టెస్టులతో పాటు శానిటైజేషన్ కూడా చేపట్టారు.