ఒకే కుటుంబానికి చెందిన 44 మంది రికార్డ్ క్రియేట్​ చేసిన్రు

ఒకే కుటుంబానికి చెందిన 44 మంది రికార్డ్ క్రియేట్​ చేసిన్రు

తండ్రి చదివిన స్కూల్​లో కొడుకు చదవడం... లేదా తాత చదివిన స్కూల్​లో మనవడు చదవడం మామూలే. కానీ.. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 44 మంది ఒకే యూనివర్సిటీలో చదువుకుని రికార్డ్ క్రియేట్​ చేశారు. 

అమెరికాలో ఉంటున్న వున్‌‌స్చే ఫ్యామిలీలో దాదాపు అందరూ లుబ్బాక్‌‌లోని టెక్సాస్​ టెక్ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అందుకే ఈ ఫ్యామిలీ గిన్నిస్​ వరల్డ్​ రికార్డుల్లోకి ఎక్కింది. వున్​ స్చే ఫ్యామిలీకి చెందిన అంబర్ వున్‌‌స్చే పార్కర్ గిన్నిస్​ రికార్డుల గురించి చదువుతున్నప్పుడు లూసియానాలోని వేన్ ఫ్యామిలీలో 40 మంది ఒకే యూనివర్సిటీలో చదువుకున్న రికార్డ్​ ఉందని తెలుసుకున్నాడు.  ఆ రికార్డ్​ని బ్రేక్​ చేయడానికి కావాల్సినంత మంది టెక్సాస్ టెక్ గ్రాడ్యుయేట్లు తన కుటుంబంలోనే ఉన్నారని అర్థమైంది. వెంటనే గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​ టీమ్​ని కలిశాడు. వాళ్లు వివరాలన్నీ చెక్​ చేసి, గిన్నిస్​ రికార్డ్ ఎనౌన్స్​ చేశారు.  2023లో టెక్సాస్ టెక్ యూనివర్సిటీ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫ్యామిలీకి అవార్డు కూడా ఇవ్వనున్నారు. 

1953లో ఫ్రాన్సిస్ వున్‌‌ స్చే హోల్డెన్ గ్రాడ్యుయేట్ చేసినప్పటి నుంచి డిసెంబరు 2021లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆండ్రూ సిమ్నాచెర్ వరకు మొత్తం నాలుగు తరాల వాళ్లు ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్యామిలీకి కోడళ్లు, అల్లుళ్లుగా వచ్చిన వాళ్లలో కూడా 14 మంది ఈ యూనివర్సిటీలోనే చదివారు. అంటే ఈ ఫ్యామిలీ నుంచి మొత్తం 60 మంది టెక్​ యూనివర్సిటీలో చదువుకున్నారన్నమాట! ఇంకా నలుగురు ప్రస్తుతం అక్కడే చదువుతున్నారు.