మిజోరంలో భూకంపం.. రిక్టార్ స్కేలుపై 5.2గా నమోదు

మిజోరంలో భూకంపం..  రిక్టార్ స్కేలుపై 5.2గా నమోదు

ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం చంపాయ్ ప్రాంతంలో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు వెల్లడించారు. మధ్యాహ్నం 2:20 సమయంలో భూమిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్ వెల్లడించింది. చంపాయ్‌కి తూర్పున 119 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.