Health Alert: ఈ 5 అలవాట్లు కడుపు క్యాన్సర్కు దారి తీస్తాయి..

Health Alert: ఈ 5 అలవాట్లు కడుపు క్యాన్సర్కు దారి తీస్తాయి..

క్యాన్సర్ ప్రాణాంతకం అని మనందరికి తెలుసు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఇలా చాలా రకాల క్యాన్సర్లు ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని బలిగొంటున్నాయి. అయితే మనకున్న కొన్ని అలవాట్లతో నోటి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్లు ఎటాక్ అయ్యే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

కడుపు క్యాన్సర్ లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాణాంతకమైన  క్యాన్సర్.. ఈ  కడుపుక్యాన్సర్. 2020లో దేశవ్యాప్తంగా 50వేల మంది కడుపు క్యాన్సర్ కేసులు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. 

దీర్ఘకాలిక అజీర్ణం లేదా గుండెల్లో మంట, అనుకోకుండా బరువు తగ్గడం, పొత్తి కడుపు నొప్పి, వికారం నిరంతర వాంతులు, రక్తం వాంతులు, ఆకలి లేకపోవడం, మలం విసర్జించడంలో ఇబ్బంది వంటి కొన్ని లక్షణాలు కడుపు క్యాన్సర్ ను సూచిస్తాయి. వాటికి తక్షణమే చికిత్స చేయించుకోవాలం. అయితే  మనకు ఉండే ఈ అయిదు అలవాట్లు స్టమక్ క్యాన్సర్ కు దారి తీస్తాయంటున్నారు. అవేంటో చూద్దాం. 

సాల్టీ ఫుడ్ అతిగా తినడం 

పిక్లింగ్ వెజిటేబుల్స్, స్మోక్డ్ మాంసం, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి అతిగా ఉప్పుగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ పొట్ట లోని పొర వాపు పెరిగి కడుపు క్యాన్సర్  (స్టమక్ క్యాన్సర్) వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంచుకోవాలి. 

అతిగా పొగత్రాగడం 

ధూమపానం మీ శరీరానికి హాని చేస్తుంది. అది మీ ఊపిరితిత్తులు, చర్మం లేదా కడుపు పై ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. క్యాన్సర్ సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. 

చక్కెర పానియాలు, స్నాక్స్ 

అధిక చక్కెర ఉండే పానియాలు, స్నాక్స్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్థూల కాయం , కడుపు క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది.ఎక్కువ నీటిని తీసుకోవడం, తియ్యటి పదార్ధాలను నివారించడం ద్వారా వీటిని నివారించవచ్చు. 

పండ్లు , కూరగాయలు తినకపోవడం 

సరైన పండ్లు, కూరగాయాలను తినకపోవడం వల్ల అవసరమైన పోషకాలు అందక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకుదారి తీస్తుంది. అందువల్ల ఆహారంలో తాజా పండ్లు, కూరగాయాలను చేర్చడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. 

అధిక ఒత్తిడి 

దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. విశ్రాంతి , ప్రశాంతంగా ఉండటం కోసం యోగా వంటి అభ్యసనాల ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. 

చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఎదుర్కొంటున్నట్లయితే డాక్టర్ ని సంప్రదించాలి. శస్త్ర చికిత్స , కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ ట్రీట్ మెంట్ ద్వారా క్యాన్సర్ ను నయం చేస్తారు. ఆరోగ్య కరమైన జీవన శైలి పద్దతులను పాటిస్తూ కడుపు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.