రామాయంపేట బస్టాండ్‌‌ లో బంగారం మాయం

రామాయంపేట బస్టాండ్‌‌ లో బంగారం మాయం
  •     బ్యాగులో ఉన్న 5 తులాల ఆభరణాలు చోరీ

రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్‌లో మహిళ బ్యాగులో నుంచి సుమారు ఐదు తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన దేవలక్ష్మి రామాయంపేట మండలం అక్కన్నపేటలోని బంధువుల ఇంటికి వచ్చింది. 

అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు అక్కన్నపేట నుంచి బస్సులో రామాయంపేట బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఆర్మూర్ వెళ్లే మరో బస్సులో ఎక్కిన తర్వాత తన బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఉంచిన సుమారు ఐదు తులాల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.