50 % గన్స్ డిపాజిట్‌‌‌‌.. 5,600 లైసెన్స్​డ్ గన్స్‌‌‌‌

50 % గన్స్ డిపాజిట్‌‌‌‌.. 5,600 లైసెన్స్​డ్ గన్స్‌‌‌‌
  • ముగిసిన వెపన్స్ డిపాజిట్ డెడ్ లైన్

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని లైసెన్స్​డ్ గన్స్‌‌‌‌లో 50 శాతం పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి.ఈసీ గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లలో లేదా ఆయుధాల డీలర్స్‌‌‌‌ వద్ద సోమవారంలోగా డిపాజిట్‌‌‌‌ చేయాలని ముగ్గురు కమిషనర్లు గతంలో నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్పెషల్ బ్రాంచ్‌‌‌‌ ఆధ్వర్యంలో ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 5,600కు పైగా లైసెన్స్‌‌‌‌ ఆయుధాలు ఉన్నాయి. వీటిలో సోమవారం రాత్రి వరకు 50 శాతం మాత్రమే డిపాజిట్ అయ్యాయి. స్పోర్ట్స్‌‌‌‌, బ్యాంక్​లు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీగార్డులకు మినహాయింపునిచ్చారు. దీంతో పాటు ప్రత్యర్ధులతో  ప్రాణహాణి ఉన్న కొంతమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు మినహాయింపుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. పోలింగ్ నాటికి ఆయుధాలు మొత్తం రికవరీ చేసే విధంగా  పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గత ఎన్నికల సమయంలో 8 వేల 84 గన్స్

2018 ఎన్నికల సమయంలో అప్పటి లెక్కల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 8,084 లైసెన్స్ డ్ ఆయుధాలు ఉండేవి. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా గన్ లైసెన్స్‌‌‌‌లున్నాయి. మొత్తం 5 జోన్లలో 6,263 గన్ లైసెన్స్‌‌‌‌లు ఉండగా ఇందులో అత్యధికంగా వెస్ట్ జోన్ పరిధిలో 3,426 గన్ లైసెన్స్‌‌‌‌లు ఉన్నాయి. 322 ఆయుధాలు స్పోర్ట్స్, ఆర్మీ అధికారులు, బ్యాంక్ లు ఏటీఎం క్యాష్ రీఫిల్ చేసే వాహనాల సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్నాయి. అయితే, వివిధ కారణాలతో ఈసారి లైసెన్స్​డ్ వెపన్స్ సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 4,200కు పైగా లైసెన్స్‌‌‌‌డ్ వెపన్స్ ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,364, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1,214 ఆయుధాలకు పోలీస్ అనుమతులు ఉన్నాయి. ఈ సారి వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది.

గన్స్ దుర్వినియోగం కాకుండా ఈసీ చర్యలు

ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వెలువడిన తర్వాత ఈసీ నియమావళి ప్రకారం లైసెన్స్​డ్ ఆయుధాల డిపాజిట్ కోసం నోటీసులు జారీ చేశారు. లైసెన్స్​డ్ ఆయుధాలు ఎక్కువగా బిజినెస్‌‌‌‌మన్స్, రాజకీయ నాయకులు, ప్రత్యర్ధులతో ప్రాణహాణి ఉన్న ప్రముఖుల వద్ద ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో వీరందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్​లతో ఎలక్షన్ ప్రచారాల్లో దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయని ఈసీ అంచనా. దీంతో ప్రతి ఎలక్షన్స్‌‌‌‌ సమయంలో లైసెన్స్ డ్ ఆయుధాలను  ముందస్తుగా తమ వద్ద డిపాజిట్ చేసుకుంటున్నది. ఇందులో మాజీ ఆర్మీ ఉద్యోగులు, బ్యాంక్​లు, ఏటీఎం కస్టోడియన్ వెహికల్ సెక్యూరిటీ గార్డులకు మినహాయింపు ఇస్తున్నది.