జెన్ ఏఐతో వర్కర్ల టైమ్‌‌..5.1 కోట్ల గంటలు ఆదా

జెన్ ఏఐతో వర్కర్ల టైమ్‌‌..5.1 కోట్ల గంటలు ఆదా
  •     అవసరమయ్యే చోట వీరిని వాడుకోవచ్చు
  •     ప్రొడక్టివిటీ పెరుగుతుందన్న పియర్సన్ స్టడీ

న్యూఢిల్లీ : జనరేటివ్ ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ (జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐ– టెక్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడియో, ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జనరేట్ చేసే టెక్నాలజీ) తో  ఇంకో రెండేళ్లలో వారానికి 5.1 కోట్ల గంటల పనిని ఇండియన్ వర్కర్లు తగ్గించుకోవచ్చని సర్వే ఒకటి పేర్కొంది. రొటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, తరచూ చేసే పనులకు తక్కువ సమయం కేటాయించొచ్చని వెల్లడించింది. ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్కిల్స్ నేర్చుకోవడానికి  వెచ్చించే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెన్ ఏఐతో బాగా తగ్గుతుందని, 2026 నాటికి వారానికి 26 లక్షల గంటల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీరు సేవ్ చేయొచ్చని పియర్సన్ స్టడీ పేర్కొంది.  

ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తమ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగిన వీడియోలు లేదా ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెతుక్కోవడానికి ఐటీ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీలుంటుందని, దీంతో స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెచ్చించే టైమ్ మరింత తగ్గుతుందని అభిప్రాయపడింది. మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐని వాడడం ద్వారా వారానికి 18 లక్షల గంటలను  ఇండియన్ వర్కర్లు తగ్గించుకోవచ్చని  పియర్సన్ స్టడీ పేర్కొంది.  తయారీ ప్లాంట్లలో కార్యకలాపాల కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెన్ ఏఐ వాడడంతో వర్కర్ల టైమ్ ఆదా అవుతుందని వెల్లడించింది. ఏఐ టూల్స్ సేఫ్టీ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సపోర్ట్ చేయగలవని, అలానే సేఫ్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించగలవని  పేర్కొంది. 

లాయర్లకు లాభమే

జెన్ ఏఐతో లా ప్రొఫెషనల్స్ టైమ్ కూడా ఆదా అవుతుందని పియర్సన్ స్టడీ అభిప్రాయపడింది.  మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా డాక్యుమెంట్లు కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయా? రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతున్నాయా? వంటివి విశ్లేషించడంలో  జెన్ ఏఐ సాయపడుతుందని పేర్కొంది. ‘ప్రతి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా పట్టే కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనుల కోసం ప్రజలు టైమ్ బాగా వెచ్చిస్తున్నారు.  దీంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతోంది. లేదా వారి వర్క్–లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోంది. ఈ పనులు జెన్ ఏఐ ద్వారా పూర్తయితే  కంపెనీలు, ఉద్యోగులు  అవసరమైన చోట ఎక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించడానికి వీలుంటుంది.

అంటే కస్టమర్లకు మరిన్ని సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడానికి వీలుకలుగుతుంది.  కంపెనీలు జెన్ ఏఐని తమ కార్యకలాపాల్లో ఎలా వాడుకోవాలో ప్లాన్ చేయాలి. వివిధ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉద్యోగుల టైమ్ ఆదా అయితే, వీరు అవసరమైన చోట ఎక్కువ టైమ్ కేటాయించగలుగుతారు. అంతేకాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను ట్రెయిన్ చేయడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలి. అప్పుడే జెన్ ఏఐని వీరు సరిగ్గా వాడుకోగలుగుతారు’ అని పియర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వైస్ ప్రెసిడెంట్  (స్ట్రాటజీ అండ్ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆలివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాథమ్ పేర్కొన్నారు.  జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐతో ఇండియాలో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మరింత వృద్ధి చెందుతాయని తాజాగా బెయిన్ అండ్ కంపెనీ

మెటా కలిసి విడుదల చేసిన రిపోర్ట్ కూడా పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం,  వాట్సాప్ వంటి చాట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా కస్టమర్లతో 70 శాతం  పెద్ద కంపెనీలు టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని తెలిపింది. ఇటువంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై  వచ్చే మూడునాలుగేళ్లలో భారీగా ఖర్చు చేస్తామని 60 శాతం కంపెనీలు ప్రకటించాయి. కస్టమర్లు కూడా చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  బిల్లులు చెల్లించడం, ట్రావెల్ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను పొందడం వంటి కామన్‌‌‌‌‌‌‌‌  టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం 50 శాతం మంది చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాట్లపై ఆధారపడుతున్నారు.

పియర్సన్ స్టడీ ప్రకారం జెన్ ఏఐతో  ఈ పనుల్లో  టైమ్ బాగా ఆదా కానుంది

1. ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేదా ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రమోట్ చేయడం (వారానికి 44 లక్షల గంటలు ఆదా (మొత్తం వర్కర్లందరిని పరిగణనలోకి తీసుకొని) ).
2) కస్టమర్ల  అవసరాలు లేదా అభిప్రాయాలపై డేటా సేకరించడం (39 లక్షల గంటలు ఆదా). 
3) ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రమోషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  లేదా మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేయడం(35 లక్షల గంటలు ఆదా).
4) బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలను గుర్తించడం (32 లక్షల గంటలు ఆదా).
5) ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేదా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టెక్నికల్ డిటైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరించడం (30 లక్షల గంటలు ఆదా).
6) ఆపరేషనల్ రికార్డులను మెయింటైన్ చేయడం (26 లక్షల గంటలు ఆదా).
7) కార్యకలాపాలకు సంబంధించిన ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇతరులతో షేర్ చేసుకోవడం (18 లక్షల గంటలు ఆదా).
8)  మెటీరియల్స్ లేదా డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో? లేదో? చెక్ చేయడం (16 లక్షల గంటలు ఆదా).
9) డేటా క్వాలిటీని లేదా కచ్చితత్వాన్ని నిర్దేశించడం (15 లక్షల గంటలు ఆదా).