ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట బాలాజీ నగర్ కాలనీలో తిరంగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్బడా గణేశ్తర్వాత సిటీలో ఇదే ఎత్తైన విగ్రహం. శ్రీలక్ష్మీసరస్వతి సహిత వేంకటేశ్వర మహాగణపతి రూపంలో ప్రతిష్ఠించారు. తిరంగ యూత్అసోసియేషన్సభ్యులు2021లో మొదటిసారి
36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2022లో 41, 2023లో 45 అడుగుల విగ్రహాలను పెట్టగా, ఈసారి 54 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో మొదటిసారి శశాంక్ యూత్ ఆధ్వర్యంలో 30 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు.