యాదాద్రి జిల్లాలో సబ్జెక్ట్ టీచర్ల కొరత .. టెన్త్ ఫలితాలను దృష్టి పెట్టుకొని డిప్యుటేషన్లు

యాదాద్రి జిల్లాలో సబ్జెక్ట్ టీచర్ల కొరత .. టెన్త్ ఫలితాలను దృష్టి పెట్టుకొని డిప్యుటేషన్లు
  • పని చేస్తున్న మండలాల్లోనే కొందరికి.. పక్క మండలాలకు మరికొందరు
  • జిల్లాలో 542 టీచర్ పోస్టులు ఖాళీలు

యాదాద్రి, వెలుగు : జిల్లాలో మ్యాథ్స్, సైన్స్​, సోషల్​తోపాటు ఇంగ్లిష్, తెలుగు టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. టెన్త్​క్లాసు స్టూడెంట్స్​ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాత్కాలికంగా డిప్యుటేషన్ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సబ్జెక్ట్​టీచర్స్, స్కూల్ అసిస్టెంట్లను పనిచేస్తున్న మండలాల్లోనే ఎక్కువ మందిని అడ్జస్ట్​చేస్తున్నారు. కొద్దిమందిని పక్క మండలాల్లోని స్కూల్స్​ కు పంపుతున్నారు. 

సబ్జెక్ట్​ టీచర్ల కొరత..

ప్రభుత్వ పరిధిలోని అన్ని మేనేజ్​మెంట్లలోని 754 స్కూల్స్​లో లెక్క ప్రకారం మొత్తంగా 3,357 మంది టీచర్లు ఉండాలి. అయితే దాదాపు 542 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులోనూ సబ్జెక్ట్​ టీచర్ల కొరత ఉంది. ప్రధానంగా మ్యాథ్స్, సైన్స్​, సోషల్​తోపాటు ఇంగ్లిష్, తెలుగు టీచర్ల కొరత నెలకొంది. ఈసారి ప్రైవేట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్​గవర్నమెంట్​స్కూల్స్​లో చేరారు. సబ్జెక్ట్​ టీచర్స్​కొరత టెన్త్​ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో సబ్జెక్ట్​టీచర్లను అడ్జెస్ట్ చేయాలని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. 

ఖాళీలు గుర్తింపు..

తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఈ అడ్జస్ట్​మెంట్​ను ముందుగా హైస్కూల్స్​​లో చేపట్టారు. అనంతరం ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​లో చేపట్టనున్నారు. హైస్కూల్​టీచర్స్ అడ్జస్ట్​ ప్రక్రియ డీఈవో ఆఫీసు పరిధిలో కొనసాగుతుండగా, ప్రైమరీ, అప్పర్​ప్రైమరీ స్కూల్స్​లో టీచర్ల అడ్జస్ట్​మెంట్​ను ఎంఈవోలు నిర్వహిస్తారు. ముందుగా హైస్కూల్స్​ వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్​జీటీ, సబ్జెక్ట్​ టీచర్ల ఖాళీలు, ఒకరి కంటే ఎక్కువగా సబ్జెక్ట్​టీచర్స్​ ఎక్కడ పని చేస్తున్నారో గుర్తించారు. 

60 మంది టీచర్లు అడ్జస్ట్​మెంట్..

జిల్లాలోని హైస్కూల్స్​లో మొత్తంగా 60 మంది టీచర్స్​ను అడ్జస్ట్​మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిలో 40 నుంచి 45 మంది టీచర్లను వారు పని చేస్తున్న మండలంలోనే పోస్టులు ఖాళీగా ఉన్న హైస్కూల్​కు పంపించనున్నారు. 10 నుంచి 15 మంది టీచర్లను పక్క మండలాలకు పంపిస్తారు. వీరి ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్​లోని డిప్యుటేషన్లపై దృష్టి సారించనున్నారు. ఈ విధంగా మరో వంద మంది టీచర్లను పని చేస్తున్న స్కూల్​నుంచి ఇతర గ్రామాలకు పంపించనున్నారు. 

టీచర్ల ఖాళీలు ఇలా..

స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 1,864 ఉండగా 190 ఖాళీలున్నాయి. ఎస్​జీటీలు 1,457 ఉండగా 335 ఖాళీలున్నాయి. పండిట్స్, పీఈటీ పోస్టులు 36 ఉండగా 18 ఖాళీలున్నాయి. మొత్తంగా 3,357 పోస్టులు ఉండగా 542 ఖాళీగా ఉన్నాయి. 

సబ్జెక్ట్​ పోస్టుల ఖాళీలు ఇలా ఉన్నాయి.  

సబ్జెక్ట్​            పోస్టులు        ఖాళీలు
మ్యాథ్స్​​    304    20
సైన్స్​    448    27
సోషల్​    259    26
ఇంగ్లిష్​    232    20
తెలుగు    219    31
హిందీ    171    20